అప్పుడు తెలంగాణ వీరప్పన్ అన్న వ్యక్తితోనే.. ఇప్పుడు KCR ఫ్రెండ్ షిప్: RS ప్రవీణ్ కుమార్ ఫైర్

మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి కారకులైన కేసీఆర్, హరీష్ రావు, చీఫ్ ఇంజనీర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్

Update: 2023-10-27 12:50 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడానికి కారకులైన కేసీఆర్, హరీష్ రావు, చీఫ్ ఇంజనీర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపాలని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ కుటుంబం రూ. 40 వేల కోట్ల అక్రమంగా దోచుకున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ సిర్పూర్‌లో మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మేడిగడ్డ బ్యారేజీ నాసిరకంగా కట్టి, లక్ష కోట్ల ప్రజాధనాన్ని గంగ పాలు చేసిన కేసీఆర్‌ను వచ్చే ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. కమీషన్ల కోసమే కేసీఆర్ నిబంధనలు తుంగలో తొక్కి కాంట్రాక్టర్లకు వంతపాడడం వల్లే ఈ దుస్థితి దాపురించిందని వ్యాఖ్యానించారు.

పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి లక్ష కోట్ల రూపాయలు అప్పు తెచ్చి వృధా చేశారని మండిపడ్డారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైన్ పేరుతో మేడిగడ్డకు తరలి వెళ్లడానికి ఎమ్మెల్యే కోనప్ప కారణమని ఆరోపించారు. తన స్వలాభం కోసమే ప్రాజెక్టు తరలిపోతున్న ప్రభుత్వాన్ని ప్రశ్నించలేదన్నారు. గోదావరి, ప్రాణహిత జీవనదులున్నా పాలకుల నిర్లక్ష్యంతో ఉమ్మడి ఆదిలాబాద్ ఎడారిగా మారిందన్నారు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే కోనప్ప అన్నదాన సత్రం నడిపిస్తున్నారని, తక్షణమే ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కోనప్పను తెలంగాణ వీరప్పన్ అని సంబోధించిన కేసీఆర్ ఇప్పుడు ఆయనతోనే చెట్టాపట్టాలేసుకొని అక్రమ వ్యాపారాలు చేస్తూ వేల కోట్లు దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.

Tags:    

Similar News