కోదాడ BRS MLA మలయ్యను అరెస్ట్ చేయాలి: RS ప్రవీణ్ కుమార్

కోదాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌పై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-01-24 04:21 GMT

దిశ, వెబ్‌డెస్క్: కోదాడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌పై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్న ఎమ్మెల్యే మల్లయ్యను వెంటనే అరెస్ట్ చేయించాలని సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను డిమాండ్ చేశారు. ''కేసీఆర్ గారు, మీ కోదాడ ఎమ్మెల్యే మల్లయ్య ఎక్కడైనా అసభ్యంగా మాట్లాడొచ్చు. కానీ మా బీఎస్పీ నాయకులు పిల్లుట్ల శ్రీనివాస్, షేక్ షర్మిలాలు MLA మల్లయ్య దుశ్చర్యను ఖండిస్తే తప్పెట్లయితది? వీరిని వెంటనే విడుదల చేయాలి. Kodad MLA మల్లయ్యను వెంటనే అరెస్టు చేయాలి.'' అని ట్విట్టర్ వేదికగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.

Also Read...

అదే సీన్ రిపీట్.. రాజ్‌భవన్‌లో గవర్నర్.. ప్రగతి భవన్‌లో సీఎం 

Tags:    

Similar News