ఎమ్మెల్సీ కవిత ఆధ్వర్యంలో రేపు రౌండ్ టేబుల్ సమావేశం

పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత రౌండ్ టేబుల్ సమావేశానికి సిద్ధమైంది. ఢిల్లీలో బుధవారం మహిళా బిల్లు పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తోంది.

Update: 2023-03-14 05:20 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : పార్లమెంట్ సమావేశాల్లో మహిళా బిల్లు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత రౌండ్ టేబుల్ సమావేశానికి సిద్ధమైంది. ఢిల్లీలో బుధవారం మహిళా బిల్లు పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తోంది. అందుకు సంబంధించిన ఇప్పటికే పలు పార్టీల నేతలకు ఆహ్వానం పంపింది.మధ్యాహ్నం 3 గంటలకు లే మెరిడియన్ హోటల్‌లో సమావేశం నిర్వహిస్తున్నట్లు కవిత ఒక ప్రకటనలో తెలిపారు.

ఈనెల 10న జంతర్ మంతర్ వద్ద 12 పార్టీలతో కలిసి నిరాహార దీక్ష చేపట్టారు. మహిళ బిల్లును ఆమోదించాలని డిమాండ్ చేశారు. అయితే ఆ బిల్లుపై పార్లమెంటులో చర్చకు రాకపోవడంతో దానికి కొనసాగింపుగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు కవిత తెలిపారు. సమావేశానికి ప్రతిపక్ష పార్టీల నేతలు , పౌర సమాజం, మహిళా సంఘాల ప్రతినిధులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు.

16న మరోసారి ఈడీ విచారణ

ఈనెల 16న ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితను మరో మారు ఈడి అధికారులు ప్రశ్నించనున్నారు. ఒకరోజు ముందు మహిళా బిల్లు పై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొదటిసారి విచారణ కు ముందు కూడా జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టడం.. మళ్లీ ఇప్పుడు ఒకరోజు ముందు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం దేనికి సంకేతం అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మహిళలపై కేంద్రం వివక్ష పూరితంగా వ్యవహరిస్తుందని సంకేతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే కవిత మహిళా బిల్లు అంశాన్ని ముందుకు తీసుకొచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News