అమెరికాలో రూట్స్ టెక్-2023 ఎక్స్ పో

అమెరికాలోని ఉటా రాష్ట్రంలోని నార్త్ సాల్ట్ లేక్ సిటీలో ఫ్యామిలీ సెర్చ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో రూట్స్ టెక్-2023 ఎక్స్ పో నిర్వహిస్తున్నారు.

Update: 2023-02-27 15:30 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : అమెరికాలోని ఉటా రాష్ట్రంలోని నార్త్ సాల్ట్ లేక్ సిటీలో ఫ్యామిలీ సెర్చ్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో రూట్స్ టెక్-2023 ఎక్స్ పో నిర్వహిస్తున్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ఇన్స్టిట్యూషనల్ రిలేషన్షిప్స్, ఫ్యామిలీ సెర్చ్ ఇంటర్నేషనల్ ఆసియా చీఫ్ రిప్రజెంటేటివ్ స్టీఫెన్ ఎల్. నికెల్ ఆహ్వానం పంపారు. అందులో పాల్గొనేందుకు మంత్రి సోమవారం అమెరికాకు వెళ్లారు. పదిరోజుల పాటు పర్యటించనున్నారు. ల్యాటర్ డిసెన్స్ సంస్థ ప్రతినిధులను కలవనున్నట్లు సమాచారం.

తెలంగాణ రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చే అంశాలపై రూట్స్ టెక్-2023 ఎక్స్ పో లో మంత్రి మాట్లాడనున్నారు. ఎయిర్ పోర్ట్ లో పెద్దపల్లి జిల్లాకు చెందిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన ఫైల్స్ పై మంత్రి సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధుకర్, పెద్దపల్లి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రఘు వీర్ సింగ్, బీఆర్ఎస్ నాయకులు బలరాం రెడ్డి, రాంరెడ్డి, ఎండపల్లి సర్పంచ్ జలంధర్ రెడ్డి పాల్గొన్నారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..