CM రేవంత్ రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి.. మాట నిలబెట్టుకుంటామని భరోసా
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన వేముల రోహిత్ తల్లి రాధిక సీఎం రేవంత్ రెడ్డి కలిసింది. రోహిత్ సూసైడ్ కేసును పోలీసులు క్లోజ్ చేయడంతో తమకు న్యాయం చేయాలని వేడుకుంది.
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడిన వేముల రోహిత్ తల్లి రాధిక సీఎం రేవంత్ రెడ్డి కలిసింది. రోహిత్ సూసైడ్ కేసును పోలీసులు క్లోజ్ చేయడంతో తమకు న్యాయం చేయాలని వేడుకుంది. ఈ సందర్భంగా ఫిర్యాదు పత్రాన్ని ఆయనకు అందించింది. దీనికి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. రోహిత్ ఆత్మహత్య తనను ఎంతగానో కలిచివేసిందని చెప్పారు. నాడు స్వయంగా రాహుల్ గాంధీ సెంట్రల్ యూరివర్సిటీని సందర్శించి బాధిత కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆ మాటను నెలబెట్టుకుంటామని రోహిత్ తల్లి రాధికకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.
అయితే, శుక్రవారం అతడి ఆత్మహత్యకు ఎవరూ కారణం కాదని పోలీసులు తేల్చడంతో HCUలో ఆందోళనలు మొదలయ్యాయి. అటు రోహిత్ వేముల తల్లి కూడా ఈ కేసుపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ కేసును రీ ఓపెన్ చేయాలని తెలంగాణ డీజీపీ ఇప్పటికే నిర్ణయించారు. దీంతో ఈ అంశం మరోసారి దుమారం రేపుతోంది. రోహిత్ ఆత్మహత్యతో యూనివర్సిటీ వీసీ అప్పారావుకు సంబంధం లేదని.. అసలు రోహిత్ ఎస్సీనే కాదని పోలీసులు తేల్చారు పోలీసులు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కుండా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.
Read More..
ఫైనల్స్‌లో గుజరాత్ టీమ్‌ను ఓడించి ఛాంపియన్స్‌గా నిలవాలి.. CM రేవంత్ రెడ్డి