Minister Ponnam : రోడ్డు భద్రత అందరి బాధ్యత : మంత్రి పొన్నం
రోడ్డు భద్రత(Road Safety) సమాజంలో అందరి బాధ్యత( Responsibility) అని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhaker) పేర్కొన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో ఆయన హాజరై మాట్లాడారు.
దిశ, వెబ్ డెస్క్ : రోడ్డు భద్రత(Road Safety) సమాజంలో అందరి బాధ్యత( Responsibility) అని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhaker) పేర్కొన్నారు. రోడ్డు భద్రత మాసోత్సవాల్లో ఆయన హాజరై మాట్లాడారు. రోడ్డు భద్రత నియమాలను అమలు చేయడం సిబ్బంది పని మాత్రమే కాదని, ప్రజలందరు పాటించాల్సిన అంశాలన్నారు. ప్రయాణంతో చేసే తప్పులతో జీవితాలు, కుటుంబాలు, నష్టపోతున్నందునా రోడ్డు భద్రత వారోత్సవాలపై కఠినంగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి పాఠశాలలో యూనిసెఫ్ సహకారంతో ట్రాఫిక్ అవేర్ నెస్ పార్కు ఏర్పాటు చేసి విద్యార్థి దశ నుంచి అవగాహాన కల్పిస్తామన్నారు. తొలి దశలో కనీసం 500 నుంచి 1000పాఠశాలల్లో ట్రాఫిక్ అవేర్ నెస్ పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. 7వ తేదీన గడ్కరీ నిర్వహిస్తున్న సమావేశంలో ట్రాఫిక్ చట్టాల సంస్కరలు, విదేశాల్లో అమలవుతున్న మాదిరిగా చట్టాల రూపకల్పనపై చర్చించనున్నట్లుగా తెలిపారు.
రాష్ట్రంలో డ్రైవింగ్ పొరపాట్లకు పాల్పడిన వారికి సంబంధించి 7వేల వరకు లైసెన్స్ లు రద్దు చేశామని, అయితే విదేశాల్లో మాదిరిగా లైసెన్స్ రద్దు అంశాలను పరిశీలించాల్సి ఉందన్నారు. లైసెన్స్ లు రద్దయిన వారి పేర్లతో వాహనాల రిజిస్ట్రేషన్లు జరుగకుండా, మళ్లీ వారు వాహనాలు నడపకుండా చూస్తామన్నారు. మనిషిలో సత్ప్రవర్తన, భయం రెండు అంశాల ద్వారా రోడ్డు భద్రత చర్యలు అమలు చేస్తామన్నారు. బ్లాక్ స్పాట్స్ నిర్మూలనకు, రోడ్ల నిర్మాణం సక్రమంగా చేసేందుకు చర్యలు, జంక్షన్లలో మార్పులు చేయనున్నట్లుగా తెలిపారు. ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతపై ప్రచారం చేయాలని సూచించారు. మనిషిలో సత్ప్రవర్తన, భయం రెండు అంశాల ద్వారా రోడ్డు భద్రత చర్చలు అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో , ప్రత్యేక కార్యదర్శి వికాస్ రాజ్, ట్రాఫిక్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్, రవాణ శాఖ అధికారులు పాల్గొన్నారు.