CM Revanth Reddy: సర్వేకు ముందు కీలక పరిణామం.. రేవంత్ రెడ్డితో ఆర్.కృష్ణయ్య భేటీ

సర్వేకు ముందు కీలక పరిణామం.. రేవంత్ రెడ్డితో ఆర్.కృష్ణయ్య భేటీ అయ్యారు.

Update: 2024-11-04 09:52 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు (BC Reservations) సంబంధించి డెడికేషన్ కమిషన్ (Dedication Commission) ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై బీసీ సంఘం నేతలు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్యతో  (R. Krishnaiah) పాటు పలువురు బీసీ సంఘం నేతలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సోమవారం సచివాలయంలో సీఎంతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక కమిషన్ ఏర్పాటు విషయంలో ప్రభుత్వ ఆలోచన పట్ల రేవంత్ రెడ్డికి ఆర్. కృష్ణయ్య, బీసీ సంఘం నేతలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ భేటీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ తో పాటు ఫిషర్ మెన్ కమిషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, బీసీ సంఘం నేతలు ఉన్నారు.

బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆదివారం సాయంత్రం మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి, సీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం తదితరులు కలిసి సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా డెడికేషన్ కమిషన్ ఏర్పాటుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కులగణనపై ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చేపట్టాలని సీఎం సూచించారు.

Tags:    

Similar News