చంద్రబాబుకు లేఖకు రేవంత్ రిప్లై.. ఈ నెల 6న భేటీకి తెలంగాణ CM గ్రీన్ సిగ్నల్

ఏపీ సీఎం చంద్రబాబు లేఖకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిప్లై ఇచ్చారు. ఈ మేరకు సీఎం రేవంత్ చంద్రబాబుకు మంగళవారం రిటర్న్

Update: 2024-07-02 14:32 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు లేఖకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిప్లై ఇచ్చారు. ఈ మేరకు సీఎం రేవంత్ చంద్రబాబుకు మంగళవారం రిటర్న్ లేఖ రాశారు. పదేండ్లుగా అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర విభజన అంశాలపై ముఖాముఖీ చర్చిద్దామన్న చంద్రబాబు అభిప్రాయంతో ఏకీభవిస్తున్నానని, ఈ మేరకు ఈ నెల 6వ తేదీన హైదరాబాద్‌లోని ప్రజా భవన్‌లో భేటీకి ఆహ్వానిస్తున్నానని రేవంత్ లేఖలో పేర్కొ్న్నారు. ‘‘విభజన అంశాలపై చర్చల ప్రతిపాదనలకు మీరు చేసిన అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నా. పెండింగ్‌లోని విభజన సమస్యలను పరిష్కరించుకుందాం. రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రజల తరుఫున చంద్రబాబును చర్చలకు ఆహ్వానిస్తున్నాం.

తెలుగు రాష్ట్రాల పరస్పర సహకారానికి ముఖాముఖీ చర్చలు అవసరం. చర్చలే పరస్పర సహకారానికి గట్టి పునాది వేస్తాయి. నాలుగోసారి సీఎం అయిన అరుదైన నేత చంద్రబాబు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన కూటమికి శుభాకాంక్షలు’’ అని రేవంత్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు. కాగా, విభజన అంశాలపపై ఫేస్ టూ ఫేస్ భేటీ అయ్యి చర్చిద్దామని సీఎం చంద్రబాబు సోమవారం రేవంత్ రెడ్డికి లేఖ రాసిన విషయం తెలిసిందే. తాజాగా చంద్రబాబు లేఖకు రేవంత్ రిప్లై ఇచ్చారు. భేటీకి రేవంత్ సానుకూలంగా స్పందించడంతో.. ఈ నెల 6న రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం కాబోతున్నారు. రేవంత్, చంద్రబాబు భేటీపై రెండు తెలుగు స్టేట్స్‌లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Similar News