KTR: రాజకీయాలకు బ్రేక్.. కేటీఆర్ సంచలన ట్వీట్ వైరల్
బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన ట్వీట్ చేశారు. రాజకీయాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.
దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) సంచలన ట్వీట్ చేశారు. రాజకీయాల నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. షాకయ్యారు కదా. పూర్తిగా కాదులేండి.. కొద్ది రోజులు రెస్ట్ కావాలని బ్రేక్ తీసుకుంటున్నట్లు చెప్పారు కేటీఆర్. తాను రీ ఫ్రెష్ అవ్వాలనుకుంటున్నానని, కొద్దిరోజులు ఈ కార్యకలాపాలన్నింటికీ దూరంగా ఉండాలనుకుంటున్నానని పేర్కొన్నారు. రాజకీయాల్లో కొద్దిరోజులు యాక్టివ్ గా లేను కదా అని తన రాజకీయ ప్రత్యర్థులు తనను మిస్సవ్వరని అనుకుంటున్నానని ఆ ట్వీట్ లో రాసుకొచ్చారు.
కేటీఆర్ ఎక్స్(X)లో చేసిన ఈ ట్వీట్ పై నెటిజన్లు తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. మీ బదులు మేం బ్యాటింగ్ చేస్తాం సర్.. వాళ్లు మిమ్మల్ని మిస్ కాకుండా చూసుకుంటాం అని ఒకరు, బాగా రీ ఫ్రెష్ అయి, ఫుల్ ఎనర్జీతో రండి అని మరొకరు.. బ్రేక్ మీకు కానీ.. మీ ప్రత్యర్థులకు కాదు.. మేం వదలం అని ఇంకొకరు.. ఇలా రకరకాలుగా నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. నిన్న తెలంగాణ భవన్ లో మాట్లాడిన కేటీఆర్.. సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. సోనియా గాంధీ వల్లే వచ్చిందని చెప్పి.. రాష్ట్ర ఆత్మగౌరవాన్ని, తెలంగాణ బిడ్డల ఆత్మ బలిదానానాలను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కించపరుస్తున్నాడని కేటీఆర్ ఆగ్రహించారు.
Off to a wellness retreat for a few days. Hope my political opponents won’t miss me too much 😁
— KTR (@KTRBRS) November 30, 2024