యువతను మోసం చేసిన రేవంత్ సర్కార్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
రేవంత్ సర్కార్ యువతను మోసం చేసిందని, యువతకు ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి డోఖా చేసిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.
దిశ, వెబ్ డెస్క్: రేవంత్ సర్కార్ యువతను మోసం చేసిందని, యువతకు ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి డోఖా చేసిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Dubbaka MLA Kotha Prabhakar Reddy) అన్నారు. దుబ్బాకలో ఫాక్స్‌కాన్ మల్టి నేషనల్ కంపెనీ (Foxconn Multi National Company) ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళా జాబ్ మేళా (Women Job Mela) కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన.. కేటీఆర్ (KTR) హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి (hyderabad Devolopment) జరిగిందని, పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. అలాగే ఎన్నో కంపెనీలు హైదరాబాద్ కు తీసుకు రావడం జరిగిందని, హైదరాబాద్ కు ఒక బ్రాండ్ ఇమేజ్ కల్పించడంలో కేటీఆర్ విజయవంతమయ్యాడని అన్నారు.
అంతేగాక ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందని తెలిపారు. ఇక ఫాక్స్ కాన్ మల్టి నేషనల్ కంపెనీ కొంగర కలాన్ లో కేసీఆర్ (KCR) హయాంలో ఏర్పాటు చేశారని, ఈ కంపెనీలో సెల్ ఫోన్ విడి భాగాలు తయారు చేస్తారని చెప్పారు. కంపెనీ కి సెలెక్ట్ అయిన వారికి మంచి భవిష్యత్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. దుబ్బాక ప్రాంత మహిళల కోసం జాబ్ మేళా ఏర్పాటు చేసిన కంపెనీ యాజమాన్యంకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వందల సంఖ్యలో మహిళలు తరలిరావడంతో జాబ్ మేళా విజయవంతమైందని బీఆర్ఎస్ ఎమ్యెల్యే సంతోషం వ్యక్తం చేశారు.