రేవంత్ రెడ్డి కనీసం సీఎంలా నటించండి..! బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఎద్దేవా
రేవంత్ రెడ్డి కనీసం ముఖ్యమంత్రిలా నటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు.

దిశ, వెబ్ డెస్క్: రేవంత్ రెడ్డి కనీసం ముఖ్యమంత్రిలా నటించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆయన.. ముఖ్యమంత్రిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్.. మన సీఎం, తాను సీఎం అనే విషయాన్ని తరచుగా మర్చిపోతుంటారని, ఆయన తన పాత్రను మార్చుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారని అన్నారు. ఈ రోజు ఏకంగా తానే సుప్రీంకోర్టు (Supreme Court) అని తేల్చేశాడని, అసెంబ్లీ (Assembly)లో ఎమ్మెల్యే ఫిరాయింపుల కేసు (MLA defection case)పై తీర్పు ఇవ్వాలని నిర్ణయించారని తెలిపారు.
పార్లమెంటరీ నియమాల ప్రకారం (According to parliamentary rules) కోర్టు దృష్టిలో ఉన్న అంశాలను సభలో ప్రస్తావించకూడదు కానీ మళ్లీ రేవంత్ రెడ్డి తాను నిబంధనలకు అతీతుడను అని స్పష్టం చేశాడని, సుప్రీం కోర్టు కన్నా తానే ఎక్కవ అని రేవంత్ రెడ్డి భావిస్తున్నాడని దుయ్యబట్టారు. సభలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలను బీఆర్ఎస్ (BRS) తప్పకుండా కోర్టుల దృష్టికి తీసుకెళ్తుందని స్పష్టం చేశారు. అలాగే రేవంత్ రెడ్డికి ఇది మొదటి సారి కాదని, గత సంవత్సరం తాను చేసిన తప్పుకు క్షమాపణ చెప్పిన తర్వాత రెండవ సారి అని చెప్పారు.
ఇక రేవంత్ రెడ్డి సీఎంలా ప్రవర్తించాలని, కనీసం సీఎంలా నటించాలని కోరారు. అంతేగాక ముఖ్యమంత్రిగా పనిచేస్తారని మిమ్మల్ని ఎన్నుకున్నారు.. కానీ పరకాయప్రవేశాలు, పగటివేషాలు, పిట్టలదొర మాటలతో కాలం వెళ్ళబుచ్చాలని చూస్తున్నారని హాట్ కామెంట్స్ చేశారు. మీ నాటకాలకి, సెన్సేషనల్ హెడ్ లైన్లకి, పంచ్ డైలాగులకు కోర్టుల పరువు తీయకండి అని, ఉపఎన్నిక (By Election) రావాలా వద్దా అన్నది కోర్ట్ నిర్ణయం, దానికి అర్హులయిన జడ్జిలు (Judges) ఉన్నారని తెలిపారు. మీరు పడకేసిన పాలన సంగతి చూడండి.. తీర్పులు మీ స్థాయి కాదు! అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.