ఆ రోజే నామినేషన్ దాఖలు చేస్తా.. కీలక ప్రకటన చేసిన రేవంత్ రెడ్డి

ఈ నెల 6వ తేదీన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు.

Update: 2023-11-05 07:22 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 6వ తేదీన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో ప్రకటించారు. ఆ రోజున కొడంగల్ నుంచి నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు నామినేషన్ దాఖలు చేయనున్నట్లు స్పష్టం చేశారు. డిసెంబర్ 3న కాంగ్రెస్ గెలుపు ఖాయమని రేవంత్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని పేర్కొన్నారు. కొడంగల్ సిద్దం.. తెలంగాణను గెలుద్దాం అంటూ తెలిపారు.


Similar News