Revanth Reddy: 'నిరసనలు వద్దు వచ్చి కలవండి'.. సీఎం ఇంటి ఎదుట 2008 డీఎస్సీ అభ్యర్థులు
తమకు న్యాయం చేయాలని 2008 డీఎస్సీ బాధితులు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు నిరసన తెలియజేశారు.
దిశ, డైనమిక్ బ్యూరో: తమకు న్యాయం చేయాలని 2008 డీఎస్సీ బాధితులు సీఎం రేవంత్ రెడ్డి ఇంటి ముందు నిరసన తెలియజేశారు. "నిరసనలు వద్దు వచ్చి కలవండి".. 'మీ రేవంతన్నగా సమస్యలు తీరుస్తా' అని ఓ మీటింగ్ లో రేవంత్ రెడ్డి చెప్పిన మాటలను బ్యానర్ గా ప్రదర్శించారు. ఈ సందర్భంగా 2008 డీఎస్సీ అభ్యర్థులు తమకు ఉద్యోగాలు ఇస్తున్నామని ప్రకటన చేయడంపై ధన్యవాదాలు తెలిపారు. అయితే తమకు త్వరగా పోస్టింగ్ ఇచ్చి పాఠశాలకు పంపించాలని కోరారు. ఫిబ్రవరిలో క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని, దాని ప్రకారం ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చి నియామక పత్రాలు అందజేసి ఆదుకోవాలని విన్నవించుకున్నారు. మంగళవారం కోర్టు తుది విచారణ ఉన్న నేపథ్యంలో సబ్ కమిటీ నివేదికను పూర్తి చేసి.. నియామక తేదీని ప్రకటించాలని బాధితులు కోరారు. అలాగే తమది ధర్నా కాదని.. విన్నపం మాత్రమే అని 2008 డీఎస్సీ సెలెక్టెడ్ బాధితులు స్పష్టం చేశారు.