BRS: తెలంగాణను కాంగ్రెస్ ఇవ్వలేదు, సాధించాం.. దీక్షా దివస్ సందర్భంగా కేటీఆర్
తెలంగాణ(Telangana)ను కాంగ్రెస్(Congress) ఇవ్వలేదు.. ప్రజా ఉద్యమం ద్వారా సాధించబడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) స్పష్టం చేశారు.
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ(Telangana)ను కాంగ్రెస్(Congress) ఇవ్వలేదు.. ప్రజా ఉద్యమం ద్వారా సాధించబడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) స్పష్టం చేశారు. 2009 నవంబర్ 29న కేసీఆర్(KCR) ఆమరణ దీక్ష చేపట్టిన సందర్భంగా నేడు బీఆర్ఎస్ పార్టీ(BRS Party) ఆధ్వర్యంలో దీక్ష దివస్(Deeksha Divas) కార్యక్రమాలు జరుపుతున్నారు. దీనిని ప్రస్తావిస్తూ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా.. తెలంగాణ విజయాన్ని నిర్దేశించిన రోజు అంటూ.. కేసీఆర్ ఫోటోలతో కూడిన పోస్ట్ చేశారు. దీనిపై ఈ రోజు డూ ఆర్ డై పోరు రాజుకొని, తెలంగాణ ఖాయమైన రోజు అని, 15 ఏళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసిన రోజు అని తెలిపారు. అలాగే అతని ఉక్కు సంకల్పం దేశం యొక్క రాజకీయ స్థాపనకు ఒత్తిడి చేసిందని అన్నారు. అంతేగాక తెలంగాణ ఇవ్వలేదు, కాంగ్రెస్‌పై సుదీర్ఘ పోరాటం చేసి కేసీఆర్ నాయకత్వంలో ప్రజా ఉద్యమం ద్వారా సాధించబడిందని వ్యాఖ్యానించారు. ఇక ప్రతిరోజూ మాకు స్ఫూర్తినిచ్చే మీ నాయకత్వానికి ధన్యవాదాలు కేసీఆర్ సార్.. రాబోయే అనేక తరాల వరకు ఇది అలాగే కొనసాగుతుందని కేటీఆర్ రాసుకొచ్చారు.