సీఎం హోదాలో తొలిసారి సొంత నియోజకవర్గానికి రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి బుధవారం తన సొంత నియోజకవర్గం కొడంగల్ లో పర్యటించనున్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో:సీఎం రేవంత్ రెడ్డి బుధవారం తన సొంత నియోజకవర్గం కొడంగల్ లో పర్యటించనున్నారు. కొడంగల్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రేవంత్ రెడ్డి.. సీఎం హోదాలో తొలిసారి నియోజకవర్గానికి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు కోస్గీ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి మంగళవారం రాత్రికి హైదరాబాద్ కు చేరుకుంటారు. కాగా ఇదివరకే తన సొంత సెగ్మెంట్ లో పర్యటించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించినా వివిధ కారణాలతో చివరి నిమిషంలో రెండు సార్లు వాయిదా పడింది. ఈ క్రమంలో రేపటి పర్యటన ఖరారు కావడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.