Revanth Reddy: మర్రి చెన్నారెడ్డి వర్థంతి సందర్భంగా సీఎం ఘన నివాళులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(United Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి (Former CM Marri Chennareddy) వర్థంతి(Death Anniversary) సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఘన నివాళులు అర్పించారు.
దిశ, వెబ్ డెస్క్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్(United Andhra Pradesh) మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి (Former CM Marri Chennareddy) వర్థంతి(Death Anniversary) సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో కూడిన స్పెషల్ ట్వీట్ చేశారు. దీనిపై స్వతంత్ర సమరయోధుడు(Freedom Fighter), తెలంగాణ నాయకుడు, మాజీ గవర్నర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి నివాళులు అంటూ రాసుకొచ్చారు.
కాగా డా. మర్రి చెన్నారెడ్డి మహాత్మ గాంధీ(Mahatma Gandhi) పిలుపుతో స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా(Congress Party Leader) కొనసాగి.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రిగా పని చేశారు. అంతేగాక కేంద్రమంత్రిగా, ఉత్తర ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాలకు గవర్నర్‌గా కూడా సేవలు అందించాడు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ ప్రజా సమితి పార్టీ పెట్టి(Telangana Praja Samithi Party), దానిని కాంగ్రెస్ లో కలిపేశారు. ప్రస్తుతం చెన్నారెడ్డి సమాధి హైదరాబాదులోని ఇందిరా పార్కు(Indira Park) ఆవరణలో ఉంది.