Sridhar Babu : రాబోయే కాలంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు.. మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు
మాటలు చెప్పే ప్రభుత్వం మాది కాదని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) అన్నారు.
దిశ, డైనమిక్ బ్యూరో: (Congress Govt Telangana) మాటలు చెప్పే ప్రభుత్వం మాది కాదని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు (Sridhar Babu) అన్నారు. రాబోయే కాలంలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా ముందుకు వెళ్తున్నామని కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం (Potti Sreeramulu Telugu University) పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం 39 వ్యవస్థాపన దినోత్సవ వేడుకల్లో మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి నెల ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని చెప్పారు. పరిశ్రమలు తీసుకొచ్చి నిరుద్యోగులకు అవకాశం కల్పించాలి అనే తమ ప్రభుత్వం ఆరాటం అని మంత్రి వెల్లడించారు.
తెలుగు భాషా, మన రాష్ట్ర నైపుణ్యం ప్రపంచవ్యాప్తంగా తెలిసేలా కృషి చేసిన మహనీయులకు ధన్యవాదాలు తెలిపారు. పద్మ భషణ్ డాక్టర్ వరప్రాద్ రెడ్డికి విశిష్ట పురస్కారం ప్రదానం సంతోషకరమన్నారు. తెలుగు భాషా విద్యార్థులు చిత్ర లేకనం చూశాం వారి నైపుణ్యం మలేషియా, అమెరికాలో కూడా ప్రతిభ చాటుతున్నారని తెలిపారు. మన సంస్కృతి సంప్రదాయాలు అలవాటు చేసుకోవాలనే ఉద్దేశ్యంతో విశ్వవిద్యాలయం స్తాపించబడిందని వివరించారు. 100 కంప్యూటర్‌లు అతి త్వరలో కేటాయిస్తాం. (AI) ఆర్టిఫిషియల్ రంగంలో యువ విద్యార్థులు నైపుణ్యం పెంపొందించే దిశగా ముందుకు పోవాలన్నారు. విశ్వ విద్యాలయ అభివృద్ధికి కోటి రూపాయలు చెక్కును అందించిన పద్మ భషణ్ డాక్టర్ వరప్రాద్ రెడ్డికి ఈ సందర్భంగా మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.