High Court: ఫుడ్ పాయిజన్ ఘటనలపై కోర్టుకు ప్రభుత్వం నివేదిక

గురుకుల పాఠశాలల పరిస్థితిపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది.

Update: 2024-12-02 09:13 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: నారాయణపేట జిల్లా మాగనూరు పాఠశాలలో ఫుడ్ పాయిజన్ (Food Poisoning) అంశంలో దాఖలైన పిటిషన్ పై సోమవారం హైకోర్టు (Telangana High Court) విచారణ జరిపింది. కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ఘటనపై కోర్టుకు ప్రభుత్వం పూర్తి వివరాలతో నివేదిక అందజేసింది. పిటిషనర్ తరపున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా కొమురం భీం జిల్లా వాంకిడి పాఠశాల విద్యార్థిని శైలజ మృతి ఘటనను పిటిషనర్ తరపు న్యాయవాది ప్రస్తావించారు. వాదనలు వినిపించడానికి మరికొంత సమయం కావాలని పిటిషనర్ కోర్టును కోరారు. దీంతో విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. కాగా ఇదే పిటిషన్ పై గత నెల 27న హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిల్లలు ప్రాణాలు పోతుంటే అధికారులు నిద్రపోతున్నారా అని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు ధర్మాసనం మొత్తం సంఘటనలపై తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ డిసెంబర్ 2కు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణ జరపగా ప్రభుత్వం పూర్తి వివరాలతో నివేదికను ప్రభుత్వం కోర్టుకు అందజేసింది.

Tags:    

Similar News