Kaushik Reddy: ఆయన చిట్టా త్వరలోనే బయట పెడతా.. కౌశిక్ రెడ్డి సంచలన ప్రకటన

దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కేసీఆర్(KCR) దళితబంధు పథకం తెచ్చారని బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) అన్నారు.

Update: 2024-12-02 11:34 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కేసీఆర్(KCR) దళితబంధు పథకం తెచ్చారని బీఆర్ఎస్(BRS) ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(Kaushik Reddy) అన్నారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తీసుకొచ్చిన దళితబంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) నీరుగార్చిందని అన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది పాలన పూర్తవుతున్నా దళితబంధు లబ్దిదారులకు డబ్బు చేరలేదని అన్నారు. దళితబంధు(Dalit Bandhu) గొప్ప పథకమని చెప్పారు. రేవంత్(Revanth Reddy) దళిత ద్రోహిగా మిగిలి పోతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ మేనిఫెస్టో(Congress Manifesto)లో దళితబంధు సాయాన్ని రూ.12 లక్షలకు పెంచుతామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. దళితబంధు ఇవ్వాలని దళిత మహిళలు అడగటం తప్పా అని ప్రశ్నించారు.

మహిళల పట్ల హుజూరాబాద్ ఏసీపీ(Huzurabad ACP) దారుణంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మహిళలు అని చూడకుండా వారిని బూటు కాళ్లతో తన్నారని అన్నారు. కాంగ్రెస్(Congress) అధికారం శాశ్వతం కాదని ఏసీపీ గ్రహించాలని సూచించారు. త్వరలోనే ఏసీపీ(ACP) చిట్టా మొత్తం బయట పెడతా అని షాకింగ్ ప్రకటన చేశారు. కాంగ్రెస్ నాయకులను అడ్డుకుంటామని పిలుపునిస్తే రాకేష్ అనే యువకుడ్ని ఇష్టమొచ్చినట్టు కొట్టి అక్రమ కేసు బనాయించారని అన్నారు. ఇంకెన్ని రోజులు ఇలా దుర్మార్గంగా ప్రవర్తిస్తారని అన్నారు. ఇన్ని రోజులు ఓపిక పట్టా.. ఇకపై సహించను అని హెచ్చరించారు. దళితులను పోలీస్ స్టేషన్‌కు అనవసరంగా పిలిపిస్తే ఊరుకునేది లేదని అన్నారు. నా ప్రాణం పోయినా సరే.. దళిత బంధు వచ్చేదాకా పోరాడతా? అని ప్రకటన చేశారు.

Tags:    

Similar News