Revanth: ప్రముఖ కళాకారుడు జగదీష్ మిట్టల్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
ప్రముఖ కళాకారుడు జగదీష్ మిట్టల్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విచారం వ్యక్తం చేశారు.
దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ కళాకారుడు జగదీష్ మిట్టల్ మృతి పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) విచారం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన.. ప్రముఖ కళాకారుడు, కళా సంపాదకులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత జగదీష్ మిట్టల్(Jagadeesh Mittal) మరణం పట్ల తీవ్ర సంతాపం(Deep Condolences) తెలియజేశారు. అలాగే భారతీయ కళలు, వారసత్వాన్ని పరిరక్షించడానికి, వాటిని ప్రోత్సహించడానికి జగదీష్ మిట్టల్ చేసిన అపారమైన కృషి అమూల్యమైనదని పేర్కొన్నారు. అంతేగాక హైదరాబాద్(Hyderabad) కేంద్రంగా ప్రారంభించిన “జగదీష్ అండ్ కమలా మిట్టల్ మ్యూజియం ఆఫ్ ఇండియన్ ఆర్ట్”(Jagadish and Kamala Mittal Museum of Indian Art) ద్వారా వారు అందించిన వారసత్వం తరతరాల కళాకారులు, కళాభిమానులు, చరిత్రకారులకు స్ఫూర్తిగా నిలుస్తుందని తెలిపారు. ఇక జగదీష్ మిట్టల్ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని(Rest In Peace), ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులు, ఆత్మీయులకు ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ.. ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.