నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ శాఖలో 755 పోస్టుల భర్తీకి రంగం సిద్ధం

నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.

Update: 2024-06-15 13:31 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: వైద్య ఆరోగ్య శాఖలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. 531 సివిల్ అసిస్టెంట్ స‌ర్జన్‌ పోస్టులు, 193 ల్యాబ్ టెక్నీషియ‌న్‌ పోస్టులు, 31 స్టాఫ్ న‌ర్సు పోస్టుల భ‌ర్తీ చేయబోతున్నది. రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు ద్వారా ఈ పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రతి వ‌ర్షాకాలం రాష్ట్రంలో డెంగీ, ఇత‌ర విష జ్వరాలు ప్రబ‌లుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వ ఆసుప‌త్రుల్లో ఖాళీల భ‌ర్తీపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించింది. దీంతో సివిల్ అసిస్టెంట్ స‌ర్జన్లు, ల్యాబ్ టెక్నీషియ‌న్లు, స్టాఫ్ న‌ర్సుల ఖాళీల సర్కార్ భ‌ర్తీ చేయాలని చూస్తోంది. నియామకాల అనంతరం ఆయా పీహెచ్ సీల్లో డిమాండ్ కు అనుగుణంగా సర్జన్లను నియమించనున్నారు.

Tags:    

Similar News