రెరా చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సి ఉంది.. సీఎం రేవంత్ రెడ్డితో రెరా చైర్మన్ భేటీ

రెరా చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Update: 2024-06-11 11:42 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: రెరా చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఇవాళ సచివాలయంలో తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) చైర్మన్, హైకోర్టు రిటైర్డ్ జడ్జి ఎ. రాజశేఖర్ రెడ్డి, సభ్యులు పి. ప్రదీప్ కుమార్ రెడ్డి, చిత్రా రామచంద్రన్ లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.

శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ రంగంలో కొనుగోలుదారులు మోసపోకుండా రెరా చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వివరించారు. మరోవైపు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో శిక్షణ పొందుతున్న తెలంగాణ కేడర్‌కు చెందిన ఐఏఎస్-2023 బ్యాచ్ అసిస్టెంట్ కలెక్టర్‌లతో ముఖ్యమంత్రి సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో కాసేపు సీఎం ముచ్చటించారు.

Tags:    

Similar News