Lagcherla incident: పరిగి పీఎస్ నుంచి 40 మంది రైతుల విడుదల.. ఇంకా స్టేషన్‌లోనే 15 మంది రైతులు
వికారాబాద్ జిల్లా కలెక్టర్(Vikarabad Collector)పై దాడి ఘటనలో 55 మంది రైతుల(Farmers)ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
దిశ, వెబ్‌డెస్క్: వికారాబాద్ జిల్లా కలెక్టర్(Vikarabad Collector)పై దాడి ఘటనలో 55 మంది రైతుల(Farmers)ను పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. మంగళవారం మధ్యాహ్నం పరిగి పోలీస్ స్టేషన్(Parigi PS) నుంచి 40 రైతులను పోలీసులు విడుదల చేశారు. మరో 15 మంది రైతులను పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు ఈ దాడి ఘటనను పోలీస్ శాఖ సీరియస్‌గా తీసుకుంది. అధికారులపై దాడి చేసిన వారితో పాటు.. గ్రామస్తులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సురేశ్‌ది బీఆర్ఎస్ పార్టీగా గుర్తించారు.
అతనిది హైదరాబాద్‌లోని మణికొండ కాగా, ప్లాన్ ప్రకారమే లగచర్లకు వచ్చి గ్రామస్తులను రెచ్చగొట్టి అధికారుల మీదకు ఉసిగొల్పారని పోలీసులు నిర్ధారించారు. ఇదిలా ఉండగా.. మంత్రి శ్రీధర్ బాబు(Minister Sridhar Babu)తో వికారాబాద్ జిల్లా ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ఐజీ సత్యనారాయణ, కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ నారాయణరెడ్డి మంత్రితో సమావేశం అయి లగచర్ల ఘటనను శ్రీధర్ బాబుకు వివరించారు.