కుక్కలకు ఫుడ్ పెట్టాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి : జిహెచ్ఎంసి

వీధి కుక్కలకు ఫుడ్ అందించేవారికి జిహెచ్ఎంసి షాక్ ఇచ్చింది.

Update: 2024-08-08 11:52 GMT

దిశ, వెబ్ డెస్క్ : వీధి కుక్కలకు ఫుడ్ అందించేవారికి జిహెచ్ఎంసి షాక్ ఇచ్చింది. ఇకనుండి వీధి కుక్కలకు ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ పెట్టడం కుదరదని తేల్చి చెప్పింది. అలా పెట్టాలంటే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆదేశాలిచ్చింది. రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ ఫుడ్ పెట్టడానికి వీల్లేదని, తాము కేటాయించిన ప్రదేశాల్లో మాత్రమే వాటికి ఫుడ్ అందించాలని స్పష్టం చేసింది. వీధి కుక్కలకు ఆహారం అందించే వాలంటీర్లు, స్వచ్చంధ సంస్థలు, నగర పౌరులు ఎవరైనా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. జనవాసాలకు, స్కూళ్ళు, ప్లే గ్రౌండ్స్ కు దూరంగా ప్రత్యేక ప్రదేశాలను వీధి కుక్కలకు ఆహారం అందించడానికి కేటాయించామని, ఆ ప్రదేశాల్లో మాత్రమే ఆహారం అందించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనితో అయిన వీధి కుక్కల స్వైర విహారం, దాడులు తగ్గే అవకాశం ఉంటుందని జిహెచ్ఎంసి అధికారులు అభిప్రాయపడుతున్నారు.


Similar News