రేపటి నుంచి నుంచి ‘దోస్త్’ సెల్ఫ్ రిపోర్టింగ్

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, భారీ వర్షాల సూచన , అలాగే శుక్ర, శనివారం (21, 22) తేదీల్లో ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని కళాశాలలో దోస్త్ -2023 షెడ్యూల్ ను ఉన్నత విద్య మండలి సవరించింది.

Update: 2023-07-21 16:46 GMT

దిశ , తెలంగాణ బ్యూరో : తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, భారీ వర్షాల సూచన , అలాగే శుక్ర, శనివారం (21, 22) తేదీల్లో ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలోని కళాశాలలో దోస్త్ -2023 షెడ్యూల్ ను ఉన్నత విద్య మండలి సవరించింది. దోస్త్ ఫేజ్-III సంబంధించి సవరించిన షెడ్యూల్ తేదీలలో రిపోర్ట్ చేయాలని విద్యార్థులకు సూచించింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి ప్రధాన కార్యదర్శి కమిషనర్, కాలేజియేట్ ఎడ్యుకేషన్ వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్.ఆర్. లింబాద్రి ప్రకటించారు .

ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ (కళాశాల ఆన్‌లైన్ చెల్లింపు ద్వారా రుసుము/సీటు రిజర్వేషన్ రుసుము ) థర్డ్ ఫేజ్ విద్యార్థులకు అలాగే ఫేజ్ 1,2,3లలో ఆన్ లైన్ లో సీట్ లు నిర్దారించుకున్న విద్యార్థులు (సెల్ఫ్ రిపోర్టింగ్ ) 26 వ తేదీన రిపోర్ట్ చేయాలని తెలిపారు. అలాగే ఫస్ట్ సెమిస్టర్ తరగతులు 26 వ తేదీన ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. దోస్త్-2023: ఇంట్రా-కాలేజ్ ఫేజ్ షెడ్యూల్ కు సంబంధించి సీసీఓటీపీని కళాశాలలో ఇదివరకే రిపోర్ట్ చేసిన అభ్యర్థుల కోసం) వెబ్ ఆప్షన్ ఎంపిక కోసం 31 వ తేదీన, ఇంట్రా-కాలేజ్ ఫేజ్ సీట్ల కు సంబంధించి వివరాలను ఆగష్టు ఒకటవ తేదీన వెల్లడిస్తామని పేర్కొన్నారు. 

Tags:    

Similar News