కేవలం 30 రోజుల్లో 7.44 కోట్ల బీర్లు తాగేసిన తెలంగాణ ప్రజలు

తెలంగాణలో మద్యం అమ్మకాల జోరు కొనసాగుతూనే ఉంది. అసలే వేసవి కాలం కావడం.. వరుసగా పెళ్లి ముహుర్తాలు ఉండటంతో బీర్ల అమ్మకాలు రికార్డు స్థాయికి చేరుకున్నట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ తెలిపింది.

Update: 2023-06-01 06:59 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో మద్యం అమ్మకాల జోరు కొనసాగుతూనే ఉంది. అసలే వేసవి కాలం కావడం.. వరుసగా పెళ్లి ముహుర్తాలు ఉండటంతో బీర్ల అమ్మకాలు రికార్డు స్థాయికి చేరుకున్నట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ తెలిపింది.కేవలం మే నెలలో మాత్రమే రికార్డు స్థాయిలో 7.44 కోట్ల బీరు సీసాలు ఖాళీ చేసినట్లు తెలిస్తుంది. ఎండ వేడిని తట్టుకునేందుకు యువకులు ముఖ్యంగా బీర్లకే ఎక్కువ మొగ్గు చూపినట్టు ఈ బీర్ల అమ్మకాలు చూస్తుంటే తెలుస్తుంది. 2019 మే నెలలో రికార్డు స్థాయిలో 7.2 కోట్ల బీర్లు అమ్ముడు పోగా.. తాజాగా ఈ రికార్డును బద్దలు కొడుతూ.. ఏకంగా. 7.44 కోట్ల బీర్లు అమ్ముడయ్యాయి. అయితే కేవలం ఒక్క బీరు సీసాలే ఈ రేంజ్ అమ్ముడు పోతే మొత్త మధ్యం అమ్మాకలు ఏ రేంజ్‌లో అమ్ముడు పోయాయో పూర్తి లేక్కలు తెలియాల్సి ఉంది.

Also Read..

బ్రేకింగ్: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో తెరపైకి మళ్లీ కవిత పేరు 

Tags:    

Similar News