Mahesh Kumar Goud : పార్టీ కోసం కష్టపడే వారికి గుర్తింపు : మహేష్ కుమార్ గౌడ్

పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో గుర్తింపు ఉంటుందని పీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud)స్పష్టం చేశారు.

Update: 2024-11-30 09:06 GMT

దిశ, వెబ్ డెస్క్ : పార్టీ కోసం కష్టపడ్డ నాయకులకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో గుర్తింపు ఉంటుందని పీసీసీ చీఫ్ బి.మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud)స్పష్టం చేశారు. కింది స్థాయి నాయకుల కష్టంతోనే మనం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చామని, రాబోయే అన్ని రకాల పదవులలో నాయకులకు అవకాశాలు ఇస్తామని భరోసానిచ్చిరు. గాంధీ భవన్ లో టీపీసీసీ ఆదివాసీ కాంగ్రెస్ సమావేశం (Tribal Congress meeting) చైర్మన్ బెల్లయ్య నాయక్(Bellaiah Nayak)అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, జాతీయ నాయకులు కొప్పుల రాజు తదితరులు పాల్గొన్నారు. సమావేశంలో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన తెలంగాణలో ఉద్యమ ఆకాంక్షలను తుంగలో తొక్కిన కేసీఆర్ కుటుంబంతో సహా బీఆర్ఎస్ నాయకులు పదేళ్లుగా రాష్ట్ర వనరులను ఇష్టమున్నట్టు దోచుకున్నారని విమర్శించారు. అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడి 8 లక్షల కోట్ల అప్పులతో రాష్ట్రాన్ని నాశనం చేసిన చరిత్ర బీఆర్ఎస్ వాళ్ళదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన అన్ని రకాల హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తున్నామని, ఏడాదిలోనే మనం ఎన్నో మంచి పనులు చేసినా బీఆర్ఎస్ మనపై అబద్దాలు ప్రచారం చేస్తూ రాజకీయంగా పూట గడుపుకుంటుందని మండిపడ్డారు. ప్రభుత్వం చేసిన మంచి పనులకు పెద్ద ఎత్తున గ్రామాల్లో ప్రచారం కల్పించాలని, చేసిన పనులను మనం చెప్పుకోకపోతే వెనుకబడిపోతామని, బీఆర్ఎస్, బీజేపీలు మనపై చేస్తున్న అబద్దాలను తిప్పికొట్టాలని కేడర్ కు పిలుపునిచ్చారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతు బంధు ఇచ్చామని, రైతు రుణమాఫీ కోసం 18 వేల కోట్లు కేటాయించామని, మరో 3 వేల కోట్లు ఇస్తున్నామని, 50 వేల ఉద్యోగాలు 10నెలల్లోనే ఇచ్చిన ఘనత మన ప్రభుత్వానిదన్నారు. ఇచ్చిన హామీల ప్రకారం బస్ లలో మహిళలకు ఉచిత ప్రయాణాలు, 200 యూనిట్ల కరెంట్, 500 రూపాయలకే సిలిండర్, ఆరోగ్య శ్రీ పథకాలు లాంటి అనేక కార్యక్రమాలు చేసామని వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. బీజేపీ మత తత్వ ప్రచారంతో లబ్ది పొందుతుందని, బీజేపీ మతతత్వ ప్రచారాన్ని మోడీ అబద్దాలను తిప్పికొట్టాలని సూచించారు. రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని అవ్వాల్సిన అవసరం ఉందని, దేశాన్ని ఒక్కతాటిపై తెచ్చి అభివృద్ధి చేసే లక్ష్యంతో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారని గుర్తు చేశారు. కులగణన ఎంత అవసరమో ఆయన వివరించి చెప్పి తెలంగాణలో అమలు చేశారన్నారు.

ఏఐసీసీ నాయకులు కొప్పుల రాజు మాట్లాడుతూ ఆదివాసీ అంశాలపై లోతుగా చర్చించి సమస్యలు పరిష్కరించేందుకు నాగార్జున సాగర్ లో వారం రోజుల పాటు క్యాంపు నిర్వహించనున్నామని తెలిపారు. రోజుకు 7,8 అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాలన్నారు. సమావేశంలో బెల్లయ్య నాయక్ తదితరులు మాట్లాడారు.

Tags:    

Similar News