తెలంగాణకు ‘ఎల్‌డీసీ ఎక్స్‌లెన్స్’ అవార్డు

రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గౌరవం దక్కింది. విద్యుత్ రంగంలో జాతీయ స్థాయిలో నిర్వహించే ‘ఎల్‌డీసీ ఎక్స్‌లెన్స్’ అవార్డు దక్కింది. ..

Update: 2024-12-15 15:52 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రానికి జాతీయ స్థాయిలో గౌరవం దక్కింది. విద్యుత్ రంగంలో జాతీయ స్థాయిలో నిర్వహించే ‘ఎల్‌డీసీ ఎక్స్‌లెన్స్’ అవార్డు దక్కింది. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శనివారం హైలెవల్ నేషనల్ పవర్ సిస్టమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ‘ఎల్‌డీసీ ఎక్స్‌లెన్స్’ అవార్డు ప్రదానం కార్యక్రమం జరిగింది. కాగా సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ చైర్‌‌మన్ ఘన్ శ్యాంప్రసాద్, నేషనల్ లోడ్ డిస్పాచ్ సెంటర్ సీఎండీ నరసింహన్ చేతుల మీదుగా ట్రాన్స్ కో సీఎండీ కృష్ణ భాస్కర్ అవార్డును అందుకున్నారు. దేశంలోని ఆయా రాష్ట్రాలు పోటీలో నిలిచాయి. ఆంధ్రప్రదేశో, గుజరాత్, హర్యానా, కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలను వెనక్కి నెట్టి మరీ ఈ అవార్డును తెలంగాణ దక్కించుకుంది. తెలంలగాణకు ఈ అవార్డు దక్కడంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, విద్యుత్ శాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా అభినందనలు తెలిపారు.


Similar News