Reavanth Reddy: సీఎంని కలిసిన బండారు దత్తాత్రేయ.. ఆ కార్యక్రమానికి రావాలని ఆహ్వానం

హైదరాబాద్ లో జరిగే అలయ్ బలయ్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డిని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆహ్వానించారు.

Update: 2024-08-20 05:36 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ లో జరిగే అలయ్ బలయ్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డిని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆహ్వానించారు. రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో బండారు దత్తాత్రేయ, ఆయన కుమార్తె విజయలక్ష్మి సహా పలువురు కలిశారు. దత్తాత్రేయ సీఎం రేవంత్ రెడ్డికి శాలువా కప్పి, పుష్పగుచ్చం అందజేశి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అక్టోబర్ 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగే అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరు కావాలని సీఎంను ఆహ్వానించారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వన పత్రికను అందజేశారు. అనంతరం రేవంత్ రెడ్డి, గవర్నర్ తో పాటు ఆయన కుతూరుని శాలువాతో సత్కరించారు. కాగా హైదరాబాద్ లో ప్రతి ఏటా అక్టోబర్ లో బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటారు. దీనికి పలువురు సినీ రాజకీయ ప్రముఖులను ఆహ్వానిస్తుంటారు. 

Tags:    

Similar News

టైగర్స్ @ 42..