వరద బాధితులకు భరోసా.. తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సంచలన నిర్ణయం

భారీ వర్షాలు, వరదలతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన విషయం తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు బాధితులకు విరాళాలు అందిస్తున్నారు.

Update: 2024-09-08 08:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాలు, వరదలతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం జరిగిన విషయం తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు బాధితులకు విరాళాలు అందిస్తున్నారు. తాజాగా.. తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా బాధితుల్లో భరోసా నింపేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వరద సహాయం కోసం రెండు నెలల జీతాన్ని విరాళంగా ఇస్తూ కాంగ్రెస్ శాసనసభా పక్షం ప్రకటన విడుదల చేసింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్‌లు, ప్రభుత్వ సలహాదారుల రెండు నెలలు జీతం ఇవ్వాలని నిర్ణయించారు. సీఎం రేవంత్ రెడ్డి, కొత్త పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ సూచన మేరకు ఈ వరద సహయం శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు.


Similar News