పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువవుతా: తదుపరి కార్యచరణ ప్రకటించిన రేవంత్ రెడ్డి
గాంధీ భవన్‌లో జరిగిన ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో భారత్ జోడో యాత్రపై చర్చించామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు.
దిశ, వెబ్‌డెస్క్: గాంధీ భవన్‌లో జరిగిన ఎగ్జిక్యూటివ్ మీటింగ్‌లో భారత్ జోడో యాత్రపై చర్చించామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. హైకమాండ్ ఆదేశాలతో మీటింగ్ నిర్వహించామని చెప్పారు. ఈ నెల 20 నుండి 24 వరకు అన్ని జిల్లాల్లో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తామని వెల్లడించారు. అన్ని జిల్లాల్లో ఇన్ చార్జ్‌లను నియమిస్తామని పేర్కొన్నారు. ఇటీవల ఏఐసీసీ ప్రకటించిన కొత్త కమిటీల నియామకాలతో పాత కమిటీలు రద్దు అయ్యాయని ప్రకటించారు. జనవరి 3, 4 తేదీల్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తామని చెప్పారు.
హైకమాండ్ ఆదేశాల మేరకు జనవరి 26వ తేదీ నుండి పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. రాష్ట్రంలో పాదయాత్ర ద్వారా ప్రజలకు చేరువ అవుతానని రేవంత్ దీమా వ్యక్తం చేశారు. పీసీసీ కమిటీల ఏర్పాటు కూడా అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని ఏర్పాటు చేసినట్లు స్పష్టం చేశారు. 43 లక్షల డిజిటల్ సభ్యత్యాలు నమోదు చేశామని తెలిపారు. ప్రధాని మోడీ, కేసీఆర్ వైఫల్యాలను ఛార్జ్ షీట్ రూపంలో ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ఇకపై ప్రతి ఇంటికి కాంగ్రెస్ పార్టీ వెళ్లేలా కార్యక్రమాలు చేపడుతామని అన్నారు.