మైనర్ బాలికపై అత్యాచారం.. రేపిస్ట్‌కు 20ఏళ్ల జైలుశిక్ష
మైనర్‌బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టిన వ్యక్తికి పోక్సో చట్టం ప్రకారం 20 సంవత్సరాల కారాగార శిక్ష పడింది.
దిశ, తెలంగాణ క్రైం బ్యూరో : మైనర్‌బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టిన వ్యక్తికి పోక్సో చట్టం ప్రకారం 20 సంవత్సరాల కారాగార శిక్ష పడింది. ఈ మేరకు ఎల్బీనగర్లోని 9వ ఏడీజే/పోక్సో కోర్టు మెజిస్ర్టేట్బుధవారం తీర్పు వెల్లడించింది. మహేశ్వరం డీసీపీ సీహెచ్.శ్రీనివాస్, మహేశ్వరం ఏసీపీ అంజయ్యతో కలిసిబుధవారం తన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. కందుకూరు వాస్తవ్యురాలు, వృత్తిరీత్యా కూలీ అయిన ఓ మహిళ 2017, డిసెంబర్16న పోలీస్‌స్టేషన్‌కు వచ్చి తన పెద్ద కూతురు కనిపించటం లేదని ఫిర్యాదు చేసింది. అన్ని చోట్లా గాలించినా ఆచూకీ లభించలేదని పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసిన కందుకూరు స్టేషన్ఇన్స్పెక్టర్విజయ్కుమార్దర్యాప్తు ప్రారంభించారు.
విచారణలో కందుకూరు ప్రాంతానికే చెందిన ప్రైవేట్ఉద్యోగి కొడగంటి కృష్ణ (25) బాలికను తిరుపతి తీసుకెళ్లి మెడలో పసుపుతాడు వేసి పెళ్లి చేసుకున్నట్టు తేలింది. ఆ తరువాత సత్రంలో బస చేసిన కృష్ణ ఆ మైనర్‌బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్టు నిర్ధారణ అయ్యింది. ఈ క్రమంలో నిందితున్ని అరెస్టు చేసిన సీఐ విజయ్కుమార్ఆధారాలు సేకరించి కోర్టులో ఛార్జిషీట్దాఖలు చేశారు. కేసును విచారించిన జడ్జి హరీష బుధవారం నిందితునికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. దాంతోపాటు 30వేల రూపాయల జరిమానా కూడా విధించారు. నిందితునికి శిక్ష పడేలా చూసిన దర్యాప్తు అధికారితోపాటు పబ్లిక్ప్రాసిక్యూటర్సునీతను డీసీపీ శ్రీనివాస్అభినందించారు.