అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి మోక్షం ఎప్పుడో? తీర్మానం చేసి రెండేళ్లైన మొదలు పెట్టని పనులు!

గత ప్రభుత్వం అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణం, యూత్ బిల్డింగ్ కోసం నిధులను కేటాయించింది.

Update: 2024-07-09 07:24 GMT

దిశ, యాచారం: గత ప్రభుత్వం అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణం, యూత్ బిల్డింగ్ కోసం నిధులను కేటాయించింది. గ్రామపంచాయతీలో కాంట్రాక్టర్ తీర్మానం సైతం చేయించుకోగా నేటికీ ఆ పనులను మొదలు పెట్టకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. యాచారం మండలం నజ్దిక్ సింగారం గ్రామంలోని 2వ వార్డులో రూ.3 లక్షలు, 6, 7 వార్డుల్లో రూ.10 లక్షలతో అండర్ డ్రైనేజీల నిర్మాణం యూత్ భవన నిర్మాణానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులను కేటాయించింది. గ్రామపంచాయతీలో గత పాలకవర్గం గుత్తే దారుకు తీర్మానం సైతం రాసి ఇవ్వగా నిధులు విడుదల కాకపోవడంతో రెండు సంవత్సరాలు అయినా పనులను ప్రారంభించలేదు. అండర్ డ్రైనేజ్ నిర్మాణం లేకపోవడంతో మురుగు నీటిలో పెరిగే ఈగలు, దోమలు, దుర్వాసనతో గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వమైనా అండర్ డ్రైనేజీల నిర్మాణ పనులకు నిధులను కేటాయించి సమస్యలను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

కొత్త ప్రభుత్వమైనా పరిష్కరించాలి..

గత ప్రభుత్వం అండర్ గ్రౌండ్ డ్రైనేజీల నిర్మాణం, యూత్ బిల్డింగ్ కోసం నిధులను కేటాయించింది. కానీ పనులను ప్రారంభించలేదు. రెండేళ్లుగా గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఈ సమస్యలను పరిష్కరించాలి.

- వన్నె వాడ లక్ష్మారెడ్డి, మాజీ వార్డు సభ్యుడు


Similar News