అధికారుల అండతోనే యువకుడి అత్యుత్సాహం..
నందిగామ తహసిల్దార్ కార్యాలయంలో అసలు ఏం జరుగుతుందని సామాన్య ప్రజలకు అంతుచిక్కడం లేదు.
దిశ, నందిగామ : నందిగామ తహసిల్దార్ కార్యాలయంలో అసలు ఏం జరుగుతుందని సామాన్య ప్రజలకు అంతుచిక్కడం లేదు. అధికారులు ఎవరు, బయట వ్యక్తులు ఎవరు అనేది గుర్తించలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ఇదే ఆసరాగా చేసుకొని కొంతమంది వ్యక్తులు ధరణి పోర్టల్ పేరుతో పైరవీలకు తెరతీస్తున్నారు. మండల కార్యాలయంలో ధరణి పోర్టల్ కు సంబంధించిన అన్ని పనులు చేస్తామని పైరవీ కారులు ఎక్కడో ఓ దగ్గర ప్రజలను మోసం చేస్తున్నారు. భూములకు రెక్కలు రావడంతో ధరణి లోపాలను ఆసరా చేసుకొని భూ సమస్యలు పరిష్కరిస్తున్నట్లు బాహాటంగానే వినిపిస్తున్నాయి.
నందిగామ మండల కార్యాలయం ఆవరణలో మీ సేవలో పనిచేసే ఓ యువకుడు సాయంత్రం సమయంలో రికార్డు సెక్షన్లో ఉండడం పట్ల పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రికార్డ్ సెక్షన్లో అసలు పని ఏంటి అని ఉండాల్సిన అవసరమైందని అనుకుంటున్నారు. మండలంలోని ఓ సీనియర్ అధికారితో కలిసి పైరవీలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఏది ఏమైనా ఇలాంటి వాటికి అధికారులు తావివ్వకుండా రైతులకు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు.