ప్రాణాలైనా ఇస్తాం భూములు ఇవ్వము..: మొండి గౌరెల్లి రైతులు
ప్రాణాలైనా ఇస్తాం కానీ పారిశ్రామిక పార్కు కోసం భూములను వదులుకోవడానికి

దిశ, యాచారం : ప్రాణాలైనా ఇస్తాం కానీ పారిశ్రామిక పార్కు కోసం భూములను వదులుకోవడానికి సిద్ధంగా లేమని మొండి గౌరెల్లి రైతులు ఆందోళన తీవ్రతరం చేశారు. మంగళవారం మండల పరిధిలోని మొండి గౌరెల్లి, గ్రామంలో పారిశ్రామిక పార్కు వ్యతిరేక కమిటీ సభ్యులు మేకల యాదగిరి రెడ్డి, మర్రిపల్లి అంజయ్య యాదవ్, బండిమీద కృష్ణ మాదిగ, తాండ్ర రవీందర్, ఆధ్వర్యంలో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. భూములు వదలకుంటే జీవితాలు ఆగమై తాయని లగిచర్ల, రైతుల పోరాట స్ఫూర్తితో పోరాటాలు చేయాలని నిర్ణయించారు. అనంతరం డీసీఎం ఇతర వాహనాల్లో ఇబ్రహీంపట్నంలోని ఆర్డీవో కార్యాలయానికి భారీ ఎత్తున తరలి వెళ్లి ధర్నా నిర్వహించారు.
పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేసినట్లయితే 637 మంది రైతుల కుటుంబాలు రోడ్డున పడుతాయని వెంటనే ప్రభుత్వం భూ సేకరణ చేయాలని నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మార్వో, అయ్యప్ప, ఆర్డీవో అనంతరెడ్డి, లకు వినతి పత్రాలను ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్డీవో సాగుకు యోగ్యంగా లేని గుట్టలు, చెట్లతో, కూడిన భూములను మాత్రమే తీసుకోవాలని నిర్ణయించామని తెలపగా తమ గ్రామాన్ని సందర్శించి భూముల వివరాలను సేకరించాలని రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో సంగెం రవి, గోడ కొండ్ల ప్రవీణ్, కుంచారపు సందీప్ రెడ్డి, యాస ముత్యాల రెడ్డి, గుర్రం రాఘవరెడ్డి, బడే కుమార్, నక్క శ్రీనివాస్ యాదవ్, గడల రాములు, గుర్రం మల్లారెడ్డి, కట్టెల అంజయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.