ప్రజల పక్షాన పోరాడతాం : ఎమ్మెల్యే సబితా
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టిన నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతామని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు
దిశ, మహేశ్వరం: కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని ఇబ్బందులు పెట్టిన నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతామని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరం మండలం పడమటి తండాలో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ...తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతామన్నారు. గ్రామ పంచాయతీలల్లో చేసిన అభివృద్ధి పనులకు నేటికీ రాష్ట్ర ప్రభుత్వం బిల్లులను విడుదల చేయలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసే అరెస్టులకు, బెదిరింపులకు భయపడమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన
మహేశ్వరం మండలం పడమటి తండా గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభ సమయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆందోళన చేశారు. మహేశ్వరం గడ్డ సబితమ్మ అడ్డ అంటూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కాంగ్రెస్ పార్టీ జిందాబాద్, కేఎల్ఆర్ జిందాబాద్ అని కాంగ్రెస్ పార్టీ నాయకులు నినాదాలు చేస్తూ కాసేపు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు దేప భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ...ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అధికారులకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండానే రాత్రికే రాత్రే తన ఇష్టానుసారంగా గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించేలా కుట్రలు చేశారని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధి కోసం వందల కోట్ల నిధులు విడుదల చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.