కుంటల ఆక్రమణకు సహకరించిన అధికారులపై చర్యలు తప్పవు : హైడ్రా కమిషనర్

కుంటల ఆక్రమణకు సహకరించి అధికారులపై చర్యలు తప్పవని

Update: 2025-01-09 09:48 GMT

దిశ,శంషాబాద్ : కుంటల ఆక్రమణకు సహకరించి అధికారులపై చర్యలు తప్పవని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని చారి నగర్ ప్రాంతంలో ఉన్న ధర్మోజికుంట, గొల్లవానికుంటలను ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో కలిసి గురువారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శంషాబాద్ లోని సర్వేనెంబర్ 73 లో 10 ఎకరాల 12 గంటల విస్తీర్ణంలో ధర్మో జి కుంట, సర్వే నెంబర్ 104 లో 22 ఎకరాల 23 గుంటల్లో విస్తీర్ణంలో గొల్లవాని కుంటలు ఉన్నాయన్నారు. అయితే ఈ కుంటలలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమార్కులు మట్టిని నింపి ఆక్రమణలు చేశారని ఫిర్యాదు రావడంతో పరిశీలించడం జరిగిందన్నారు.

ధర్మోజి కుంట ప్రాంతంలో ఎప్టీల్,బఫర్ జోన్ పరిధిలో భారీ ఎత్తున అక్రమ నిర్మాణ ప్రహరీ కూడా నిర్మించాలని దాన్ని పరిశీలించామన్నారు. ఈ ప్రహరీ గోడ కుంట పరిధిలోకే వస్తుందని ఇరిగేషన్ అధికారులను హైడ్రా కమిషనర్ రంగనాథ్ అడగడంతో రాదని చెప్పిన ఇరిగేషన్ అధికారులు, పూర్తి వివరాలు రికార్డు తీయడంతో బఫర్ జోన్ పరిధిలోకి వస్తుందని ఇరిగేషన్ అధికారులు చెప్పారు దీంతో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇరిగేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏమి తమాషాలు చేస్తున్నారా రికార్డులు పరిశీలించడంతో అక్రమమని తెలిసిందా ఇలాంటి వాటికి సహకరించి అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. చెరువులు కుంటలు కాపాడాల్సిన ఇరిగేషన్ అధికారులే వారికి వత్తాసు పలకడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇన్ని రోజులు అక్రమ నిర్మాణాలు చేస్తూ కుంటలో మట్టిని డంపింగ్ చేస్తే మీ దృష్టికి రాలేదా అన్నారు. ధర్మోజికుంట ప్రాంతంలో బఫర్ జోన్ లో నిర్మించిన భారీ ప్రహరీ గోడను కూల్చుకునేందుకు అక్రమ నిర్మాణదారులకు రెండు రోజులు సమయం ఇవ్వాలని ఒకవేళ వారు స్వయంగా కూల్చుకో లేకపోతే అనంతరం నేలమట్టం చేయాలని ఆదేశించారు. గొల్లవాని కుంట దాదాపు 22 ఎకరాల 23 గుంటల విస్తీర్ణంలో ఉందని అక్కడ వెంచర్ చేశారని దాన్ని పరిశీలించామన్నారు. అక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక ప్రజాప్రతినిధులుగా ఉండి కుంటలను, చెరువులను కాపాడాల్సిన మీరే అక్రమ నిర్మాణ దారులకు వత్తాసు పలికితే ఎలా అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ భూములను కుంటలను, చెరువులను కాపాడడంలో ప్రజాప్రతినిధులు ముందుండాలన్నారు. ధర్మో జి కుంట, గొల్లవాని కుంటల పై శాటిలైట్ మ్యాప్ ఆధారంగా హద్దు బందులు గుర్తించి వాటిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలను పూర్తిగా తొలగించి కుంటలను కాపాడుతామన్నారు.


Similar News