మైసిగండిని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం : మల్లు రవి
మైసిగండిని పర్యాటక కేంద్రంగా మార్చడానికి కృషి చేస్తామని పార్లమెంటు సభ్యులు మల్లు రవి అన్నారు. గురువారం ఆయన కడ్తాల్ మండలం మైసిగండి మైసమ్మ తల్లిని దర్శించుకున్నారు.
దిశ, ఆమనగల్లు::- మైసిగండిని పర్యాటక కేంద్రంగా మార్చడానికి కృషి చేస్తామని పార్లమెంటు సభ్యులు మల్లు రవి అన్నారు. గురువారం ఆయన కడ్తాల్ మండలం మైసిగండి మైసమ్మ తల్లిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మైసమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ ఆలయ ఫౌండర్ ట్రస్ట్ శిరోలి పంతు నాయక్, పీసీసీ సభ్యులు అయిళ్ల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఎంపీ మల్లురవికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ… రాష్ట్రంలోనే మైసిగండి మైసమ్మ ఆలయం ప్రసిద్ధిగాంచిందని, మైసిగండి ఆలయ అభివృద్ధితోపాటు మైసగండిని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు సహకరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు మధుసూదన్ రెడ్డి,డీసీసీ ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి,డీసీసీ ప్రధాన కార్యదర్శి బిక్య నాయక్, తహసీల్దార్ జ్యోతి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నర్సింహా, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బిచ్య నాయక్, నాయకులు భాస్కర్ రెడ్డి, రామకృష్ణ, పర్వతాలు, సత్యం, తులసిరామ్, శ్రీకాంత్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.