పరిగి పెద్ద వాగుపై వంతెన నిర్మిస్తాం : ఎమ్మెల్యే రామ్మోహన్​ రెడ్డి

పరిగి నుంచి నస్కల్​ మీదుగా వికారాబాద్​ వెళ్లే రోడ్డుపై పరిగి

Update: 2024-09-01 12:20 GMT

దిశ, పరిగి : పరిగి నుంచి నస్కల్​ మీదుగా వికారాబాద్​ వెళ్లే రోడ్డుపై పరిగి పెద్దవాగు వంతెనను త్వరలో నిర్మిస్తామని పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్​ రెడ్డి తెలిపారు. పరిగిలో రెండు రోజులుగా భారీగా వర్షాలు కురుస్తుండటంతో పరిగి నుంచి నస్కల్​ మీదుగా వికారాబాద్​ వెళ్లే రోడ్డుపై పరిగి పెద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఆదివారం ఎమ్మెల్యే టి.రామ్మోహన్​ రెడ్డి, స్థానిక అధికారులు, నాయకులు కలిసి పరిశీలించారు. వాగు ప్రవహిస్తున్న సమయంలో వాహనదారులు వెళ్లేకుండా భారీ కేడ్ ఏర్పాటు చేశారు. రాత్రుల్లో వాహనదారులు వచ్చే సమయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. వాగుందన, రోడ్డుపై ప్రవహిస్తుందని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఈ సమస్యను సీఎం రేవంత్​ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి రోడ్డు విస్తరణ చేసి, వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేసేందుకు కృషి చేస్తానన్నారు. ప్రతి వర్షాకాలంలో ప్రయాణికులు, ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కొన్నేళ్లుగా ఈ వాగుపై వంతెన లేకపోవడం ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమస్యను త్వరలోనే సీఎం చొరవతో పరిష్కరిస్తామన్నారు. ఈ పరిశీలన కాంగ్రెస్​ నాయకులు పాల్గొన్నారు.


Similar News