వెల్దండ మండలంలో బిఆర్ఎస్‌కు భారీ షాక్
వెల్దండ మండలంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది.
దిశ, వెల్దండ: వెల్దండ మండలంలో అధికార టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మండల బీఆర్ఎస్ అద్యక్షుడు గ్రామ సర్పంచ్ యెన్నం భూపతి రెడ్డితో పాటు 12 మంది సర్పంచులు, ఇద్దరు ఎంపీటీసీలు, సింగల్ విండో డైరెక్టర్లు, బీఆర్ఎస్ మండల అధ్యక్షురాలు, మహిళా సమైక్య మండల అధ్యక్షురాలు తదితర ముఖ్య నేతలు సోమవారం హైదరాబాదులో రేవంత్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్‌లో చేరారు. వారికి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బిఆర్ఎస్ ముఖ్య నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో బిఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి.
వెల్దండ మండలం లో మంచి పట్టున్న బీఆర్ఎస్ ముఖ్య నేత భూపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో మండల రాజకీయం ఆసక్తికరంగా మారింది. దీంతో మండలంలో టీఆర్ఎస్‌కు భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో కల్వకుర్తి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కసిరెడ్డి నారాయణరెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ ఠాగూర్ బాలాజీ సింగ్, మండల పార్టీ అధ్యక్షులు మూడవత్ మోతిలాల్ నాయక్, కిసాన్ సెల్ అధ్యక్షుడు పర్వత్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఆనంద్ కుమార్, వెంకట్ రెడ్డి సాయి రెడ్డి, తక్కలపల్లి శేఖర్, గోలి మధుసూదన్ రెడ్డి, రవీందర్ రావు, శ్రీనివాస్ యాదవ్, అలీ, రాజు యాదవ్, నాగేష్, నిజాం తదితర నాయకులు ఉన్నారు.