మిషన్ భగీరథలో అవినీతి తిమింగళాలు..
జిల్లా లోని ఈఈ, డీఈఈ, ఏఈఈ అధికారులు, ఏజెన్సీ
దిశ,యాలాల: జిల్లా లోని ఈఈ, డీఈఈ, ఏఈఈ అధికారులు, ఏజెన్సీ అందరూ కుమ్మకై అగ్రిమెంట్ లో ఉన్న ప్రకారం 200 మంది కార్మికులు కాకుండా కేవలం 50 నుండి 60 మందితో మాత్రమే మితిమీరిన అధిక పనులు చేయించుకుంటున్నారు. మిగతా లేని వాటిని ఉన్నట్టు చూపించి ప్రతి నెల సగటున రూ. 20లక్షలు ప్రభుత్వ సొమ్మును నిర్దాక్షిణ్యంగా కాజేస్తున్నారంటూ కార్మికుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.సరైన సమయానికి జీతాలు ఇవ్వకుండా,దాదాపు 2 సంవత్సరాలుగా ESI,PF లు కట్టకుండా కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు.ఎవరైనా ఎదురుతిరిగి ప్రశ్నిస్తే వారిని ఉద్యోగం నుండి తొలగిస్తున్న వైనం..ఆంధ్రుల నుండి విముక్తి చెందిన తెలంగాణలో వికారాబాద్ జిల్లా మిషన్ భగీరథ(గ్రిడ్) కార్మికులకు మాత్రం ఇంకా బానిస సంకెళ్లు ఉన్నాయి.
ప్రతి రోజు ఫోన్ లలో వాట్సాప్ ద్వారా లైవ్ లొకేషన్ పెట్టించుకొని మానసిక వేధింపులకు గురిచేస్తున్నారు.ఒక్కరోజు కూడా సెలవు లేకుండా ఆదివారం , అలాగే పండుగ దినాలు కూడా సెలవు లేకుండా లేబర్ ఆక్ట్ కి విరుద్ధంగా 12 గంటల పనిని చేయించుకుంటున్నారు.200 మంది పని భారం కేవలం 50 మంది తో తీర్చుకుంటూ అధికారులు వారి కష్టాని సొమ్ము చేసుకుంటున్నారు.ముఖ్యంగా తాండూరు డీఈఈ విజయ్ కుమార్ గారు తనదగ్గర తిరగడానికి ఎలాంటి కారు లేకున్నా అక్రమంగా నకిలివి సృష్టించి నెల నెల కారు బిల్లును కూడా దోచుకుంటున్నారు.దాదాపు ఈ తతంగం 4సంవత్సరలుగా గుట్టు చప్పుడుకాకుండా నడుస్తుందని వీరి అవినీతిని బహిర్గతం చేస్తానని ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ బాధ్యతవహించి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అవినీతికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని కార్మికుల కొరుతున్నారు.