వద్దే వద్దు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు మాకు వద్దు..

రావిర్యాల ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఫోర్త్ సిటీని కలుపుతూ కందుకూరు, కడ్తాల్, ఆమనగల్లు మీదుగా నిర్మించ తలపెట్టిన త్రిబుల్ ఆర్ వరకు నిర్మించే గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు భూ సర్వేకు అడుగడుగునా గిరిజన రైతుల నుండి ఆటంకాలు ఎదురవుతున్నాయి.

Update: 2025-01-08 08:44 GMT

దిశ, ఆమనగల్లు : రావిర్యాల ఔటర్ రింగ్ రోడ్డు నుంచి ఫోర్త్ సిటీని కలుపుతూ కందుకూరు, కడ్తాల్, ఆమనగల్లు మీదుగా నిర్మించ తలపెట్టిన త్రిబుల్ ఆర్ వరకు నిర్మించే గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు భూ సర్వేకు అడుగడుగునా గిరిజన రైతుల నుండి ఆటంకాలు ఎదురవుతున్నాయి. బుధవారం ఆమనగల్లు మున్సిపాలిటీ సాకిబండ తండాలో గ్రీన్ ఫీల్డ్ భూ సర్వేకు వెళ్లిన రెవెన్యూ అధికారులను పోలీసులను, గిరిజన రైతులు అడ్డుకొని, మా భూములు మాకు కావాలి, వద్దే వద్దు గ్రీన్ ఫీల్డ్ రోడ్డు వద్దు అని నినాదాలు చేయడంతో అధికారులు అక్కడి నుండి వెళ్లారు.

గిరిజన రైతులకు మద్దతుగా ఆమనగల్లు మున్సిపాలిటీ చైర్మన్ రాంపాల్, మున్సిపాలిటీ బీఆర్ఎస్ అధ్యక్షులు పత్యానాయక్ నిలిచి, అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గిరిజన రైతుల పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష కట్టిందని, మొన్న కొడంగల్ లగచర్లలో రైతుల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడం, మళ్లీ ఇప్పుడు ఆమనగల్ మున్సిపాలిటీ సాకిబండ గిరిజన రైతులకు అన్యాయం చేయడానికి ముఖ్యమంత్రి చూస్తున్నాడని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మా విలువైన భూములను కోల్పోమని, ప్రభుత్వం వెంటనే తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని సూచించారు.


Similar News