ట్రాన్స్కో అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలి : కల్వకుర్తి ఎమ్మెల్యే

ట్రాన్స్కో అధికారులు మండలంలోని బాధ్యతాయుతంగా పనిచేస్తూ

Update: 2024-09-30 13:01 GMT

దిశ, తలకొండపల్లి : ట్రాన్స్కో అధికారులు మండలంలోని బాధ్యతాయుతంగా పనిచేస్తూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి పరిష్కారం చూపించాలని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. కల్వకుర్తి పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో సోమవారం ట్రాన్స్కో అధికారులతో డివిజన్ లెవల్ లో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ఆమనగల్ ట్రాన్స్కో ఏడి శ్రీనివాస్, తలకొండపల్లి ఏఈ కటారియా హాజరై మండలంలోని నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. తలకొండపల్లి మండలం చాలా పెద్ద మండలం కావడంతో 32 గ్రామపంచాయతీల తో పాటు ఆమ్లెట్ గ్రామాలు గిరిజన తండాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయని, కరెంటు సమస్యలను పూర్తిగా పరిష్కారం చేయాలంటే సుమారు 1.87 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయించాలని ఎమ్మెల్యేను కోరినట్లు ఏఈ పేర్కొన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో చాలా రోజుల క్రితం ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలు, కేబుల్ వైర్లు శిథిలావస్థకు చేరుకున్నాయని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ట్రాన్స్కో సీఎం డి తో మాట్లాడి అత్యవసరం ఉన్నచోట స్తంభాలు, లూజు కేబుల్ వైల్డ్ ను లాగి, ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తామని అధికారులకు ఎమ్మెల్యే కసిరెడ్డి హామి ఇచ్చారు. కరెంట్ అధికారులు చేసే తప్పిదాల వల్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, చెడ్డ పేరు వచ్చే విధంగా పనిచేసే అధికారులపై ఇకముందు కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. కార్యక్రమంలో ఆయా మండలాల విద్యుత్ శాఖ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News