మోటార్ వైన్డింగ్ షాప్‌లో చోరీ

కరన్ కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మోటార్ వైన్డింగ్ షాప్ లో

Update: 2024-09-30 14:51 GMT

దిశ, తాండూరు రూరల్ : కరన్ కోట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మోటార్ వైన్డింగ్ షాప్ లో గుర్తు తెలియని దుండగులు ఆదివారం చోరీ జరిగింది. కరన్ కోట్ ఎస్సై విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం..తాండూరు మండలం అల్లాపూర్ గ్రామ సమీపంలో ఉన్న మోటార్ వైన్డింగ్ షాప్ లో చోరీ జరిగిందని నిర్వాహకుడు తెలిపాడు. సంఘటన స్థలాన్ని పోలీస్ సిబ్బంది స్థానిక ఎస్సై వెళ్లి పరిశీలించారు. గుర్తు తెలియని దుండగులు రూ. 50,000 విలువైన సామాను అపహరించారు.షాప్ నిర్వాకుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై విఠల్ రెడ్డి తెలిపారు.


Similar News