డబ్బులు డ్రా చేసి ఇస్తానని…ఏటీఎం కార్డు ఎత్తుకెళ్లిన దొంగ
ఓ మహిళ తనకు ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి రాదని ఓ వ్యక్తికి సహాయం అడిగింది
దిశ, తాండూర్ పట్టణం: ఓ మహిళ తనకు ఏటీఎంలో డబ్బులు డ్రా చేయడానికి రాదని ఓ వ్యక్తికి సహాయం అడిగింది. ఆ వ్యక్తి డబ్బులు డ్రా చేస్తానని ఏటీఎం కార్డును మార్చి వేరే ఏటీఎం కార్డు ఆ మహిళకు ఇచ్చి, ఇంకో ఏటీఎం దగ్గరికి వెళ్లి దొంగతనంగా రూ. 25 వేలు డ్రా చేశాడు. ఆదివారం ఉదయం 11 గంటలకు తాండూరు పట్టణం ఇంద్రానగర్ కు చెందిన చెందిన శోభ అనే మహిళ వెంకటేశ్వర పొదుపు సంఘంలో ఉన్న తన వాటా డబ్బులు రూ.25, 000 డ్రా చేయాలనుకుంది. తాండూరు పట్టణంలోని యూనియన్ బ్యాంక్ ఏటీఎం దగ్గరికి వెళ్ళింది. తనకు డబ్బులు డ్రా చేయడం రాదని ఓ వ్యక్తికి సహాయం అడిగింది.
ఆ వ్యక్తి డ్రా చేస్తానని ఆమెకు తెలియకుండానే తన దగ్గర ఉన్న ఇంకో ఏటీఎం కార్డును ఏటీఎంలో డ్రా చేసినట్లు నటించి మోసం చేశాడు. ఆమెకు పనికిరాని ఏటీఎం కార్డును ఇచ్చి ఆమె ఏటీఎం కార్డును తను తీసుకొని వెళ్ళాడు. అనంతరం గంటలోపే ఆమె అకౌంట్లో నుండి రూ. 25,000 డ్రా చేశాడు. తను మోసపోయానని గ్రహించిన శోభ యూనియన్ బ్యాంకు కి వెళ్లి ఏటీఎం కార్డ్ బ్లాక్ చేయాలని బ్యాంక్ అధికారులను కోరారు. అప్పటికే తనకు సహాయం చేస్తానన్న వ్యక్తి రూ. 25,000 డ్రా చేసి మోసం చేసినట్లు లబోదిబోమంది. తమ గ్రూపు సభ్యులకు వివరించింది. తనకు న్యాయం చేయాలంటూ సోమవారం తాండూరు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు మహిళ శోభ తెలిపింది.