మహిళల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

మహిళల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.

Update: 2024-09-19 10:44 GMT

దిశ, బషీరాబాద్ : మహిళల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బషీరాబాద్ మండల ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో గురువారం మహాలక్ష్మి పథకంలో భాగంగా సబ్సిడీ ద్వారా రూ.500లకే వంటగ్యాస్ సిలిండర్ పొందుతున్న వారికి గుర్తింపు పత్రాల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన వారికి రూ.500లకే ఎల్పీజీ గ్యాస్‌ సిలిండర్‌ అందజేస్తున్నామన్నారు. రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. త్వరలోనే అర్హులైన వారందరికీ రేషన్‌ కార్డులు అందజేస్తామని తెలిపారు. ప్రతిపక్షాలు ఎన్ని అసత్యాలు ప్రచారం చేసినా ఆరు గ్యారెంటీలు అమలు చేయడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

    యావత్తు తెలంగాణలో ఉన్న ఆడపడుచులందరి ఆశీస్సులతో ఏర్పడిన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కిందన్నారు. పదేళ్ల బీఆర్ఎస్, బీజేపీ పాలనలో మహిళలకు తీవ్రమైన అన్యాయం జరిగిందని, మహిళా సంఘాలను నిర్లక్ష్యం చేశారన్నారు. పావలా వడ్డీ రుణాలు ఇవ్వలేదని, సిలిండర్ ధర రూ.400 నుండి రూ.1000 పెంచిన ఘనత గత ప్రభుత్వానిదేనని అన్నారు. గతంలో మహిళలకు చేయూత అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని, నేడు మళ్లీ వారికి పూర్వ వైభవం వచ్చిందని అన్నారు.

     త్వరలో మహాలక్ష్మి పథకంలో మహిళలకు రూ.2500 ఇస్తామని అన్నారు. సంబంధింత అధికారులతో మాట్లాడి అమ్మ ఆదర్శ కమిటీ సభ్యులు చేసిన పనులకు త్వరలోనే డబ్బులు మంజూరు చేస్తామని తెలిపారు. అలాగే మహిళా సంఘం సభ్యుల విన్నపం మేరకు మహిళా సమాఖ్య భవనంకు 20 లక్షల రూపాయలు మంజూరు చేస్తామన్నారు. ఏళ్ల కాలం నుంచి వివాదంలో ఉన్న నీళ్లపల్లి అటవీ భూముల వివాదంకు పరిష్కారం చూపిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంకే దక్కిందన్నారు. గత ప్రభుత్వం ఆర్థిక శాఖ ఆమోదం లేకుండానే బషీరాబాద్ మండలంలో పనులు ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమంలో మండల మార్కెట్ కమిటీ చైర్మన్ మాధవ రెడ్డి, వైస్ చైర్మన్ చందర్, పీఏసీఎస్ చైర్మన్ వెంకట్ రాంరెడ్డి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కలాల్ నర్సింలు గౌడ్, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణరావు, సీనియర్ నాయకులు వెంకటేష్ మహారాజ్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, రాములు నాయక్, శంకరప్ప, డైరెక్టర్లు, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీలు, యూత్ కాంగ్రెస్ నాయకులు , మహిళా సమాఖ్య సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.  

Tags:    

Similar News