ఉన్నత స్థితిలోను కులవృత్తులను మరవద్దు..
భవిష్యత్తులో ఉన్నత స్థితిలో ఉన్నా కులవృత్తులను మరువద్దని రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు.
దిశ, యాచారం : భవిష్యత్తులో ఉన్నత స్థితిలో ఉన్నా కులవృత్తులను మరువద్దని రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం యాచారంలో తెలుగు కవయిత్రి మొల్లమాంబ విగ్రహన్ని కుమ్మరులు ఆవిష్కరించారు. కుమ్మరి సంఘం యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆడాల గణేష్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో "కుమ్మరుల ఆత్మగౌరవ సభ" ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువకులు ఉన్నత ఉద్యోగాలు సాధించిన కులవృత్తులను మరవొద్దన్నారు. కుండలలోని నీరు త్రాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు అన్నారు. మేడిపల్లి నక్కర్త గ్రామంలో రూ.10 లక్షలతో కమ్యూనిటీ భవనం నిర్మించమన్నారు. కాలానికి అనుగుణంగా ఆధునిక పద్దతిలో కుండల తయారీ కోసం మండలంలో 2 ఎకరాల విస్తీర్ణంలో కుమ్మరులకు అవసరమయ్యే విధంగా సముదాయం ఏర్పటు చేయడానికి కృషి చేస్తామన్నారు. కులవృత్తులకు సంబంధించిన వారికి నియోజకవర్గంలో 100 ఇళ్ల నిర్మాణానికి ఒక్కో ఇంటికి రూ. 3 లక్షలు ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొప్పు సుకన్య భాష, జడ్పీటీసీ చిన్నోళ్ల జంగమ్మ యాదయ్య, కుమ్మర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నడికుడి జయంత్ రావు, దయానంద్, శ్రవణ్ కుమార్, కొండపురం శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.