నెలలు గడవక ముందే కుంగిన రోడ్డు..

రోడ్డు కాంట్రాక్టర్ కాసుల కక్కుర్తికి ఆశపడి నాసిరకం పనులతో రోడ్డు వేయడంతో చిన్న చిన్న వర్షాలకే రోడ్డు పగిలిపోతుంది.

Update: 2024-09-07 10:46 GMT

దిశ, మహేశ్వరం: రోడ్డు కాంట్రాక్టర్ కాసుల కక్కుర్తికి ఆశపడి నాసిరకం పనులతో రోడ్డు వేయడంతో చిన్న చిన్న వర్షాలకే రోడ్డు పగిలిపోతుంది. రోడ్డు నిర్మాణం చేపట్టి నాలుగు నెలలు గడవక ముందే రోడ్డు పగుళ్లు ఏర్పడుతున్నాయి. మహేశ్వరం మండలం శ్రీశైలం జాతీయ రహదారి తుమ్మలూరు గేట్ నుంచి మహేశ్వరం మండలం కేంద్రం వరకు రోడ్డు నిర్మాణ పనులు ఇటీవల కాలంలో చేపట్టారు. మహేశ్వరం మండల కేంద్రం వరకు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. కానీ శ్రీశైలం జాతీయ రహదారి తుమ్మలూరు గేట్ నుంచి తుమ్మలూరు గ్రామ ఏనే గడ్డ వరకు సుమారు రెండు కిలోమీటర్లు రోడ్డు వేశారు. రోడ్డు వేసి నాలుగు నెలలు గడవక ముందే చిన్నపాటి వర్షపు చినుకులకు రోడ్డు పగుళ్లు ఏర్పడ్డాయి. శంకుస్థాపన చేసి ఏడాదిన్నర అవుతున్న మహేశ్వరం మండల కేంద్రం వరకు రోడ్డు నిర్మాణ పనులు నేటికి పూర్తి కాలేదు. రోడ్డు నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. మహేశ్వరం మండల కేంద్రం వరకు రోడ్డు పనులు పూర్తి కాకముందే రోడ్డు పగిలిపోవడం చూస్తుంటే కాంట్రాక్టర్ నాసిరకం పనులతో రోడ్డు వేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు, రోడ్డు కాంట్రాక్టర్ కుమ్మక్కై నాణ్యతలేని రోడ్డు వేస్తున్నారాన్ని గ్రామస్థులు పేర్కొంటున్నారు. ఆర్ అండ్ బీ శాఖ అధికారులు కళ్ళు తెరిచి నాసిరకం రోడ్డు వేస్తున్న కాంట్రాక్టర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.


Similar News