జల్‌పల్లి పెద్ద చెరువుపై కబ్జాదారుల కన్ను.. మట్టితో చెరువును పూడ్చేస్తున్న వైనం

బాలాపూర్​ మండలం పెద్ద చెరువు పై భూ బకాసురుల కన్ను పడింది. అర్థరాత్రి వేళల్లో భూకబ్జాదారులు రెచ్చి పోతున్నారు..

Update: 2023-02-28 04:06 GMT

దిశ, బడంగ్​పేట్​: బాలాపూర్​ మండలం పెద్ద చెరువు పై భూ బకాసురుల కన్ను పడింది. అర్థరాత్రి వేళల్లో భూకబ్జాదారులు రెచ్చి పోతున్నారు. రాత్రి వేళల్లో అయితే చడీ చప్పుడు లేకుండా దర్జాగా కబ్జా చేసుకోవచ్చని, ఇక తమ కబ్జాలను ఎవరు అడ్డుకోలేరనే ఉద్దేశ్యంతో చెలరేగిపోతున్నారు. భూ కబ్జాదారులు ఏకంగా పెద్ద చెరువులో మట్టిని నింపుతూ రోడ్లు వేస్తున్నా.. సంబంధిత అధికారులు పట్టీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు

మహేశ్వరం నియోజకవర్గంలోని జల్​పల్లి మున్సిపాలిటీలోని సర్వేనెంబర్​ 69 లోని జల్​‌పల్లి పెద్ద చెరువులో మట్టిపోసి రహదారి ఏర్పాటు చేశారు. అందులో కొంత భాగాన్ని కబ్జాకు యత్నిస్తున్నారు. ఇదంతా అర్థరాత్రి వేళల్లో జరుగుతున్నా .. అధికారులు మాత్రం చెరువుల వైపు కన్నెత్తి చూడడం లేదు.

కబ్జాదారుల నుంచి జల్​పల్లి పెద్ద చెరువును కాపాడాలని బాలాపూర్​ తహసీల్దార్​, కమిషనర్​లకు ఫిర్యాదు..

జల్​పల్లి మున్సిపాలిటీ లోని సర్వేనెంబర్​ 69 లోని జల్​‌పల్లి పెద్ద చెరువులో కొంత మంది కబ్జాదారులు రాత్రి వేళల్లో మట్టితో పూడ్చేస్తున్నారని, ఇప్పటికే మట్టితో రహదారిని కూడా ఏర్పాటు చేశారని, కబ్జాదారుల నుంచి జల్​ పల్లి పెద్ద చెరువును కాపాడాలని కోరుతూ.. బాలాపూర్​ మాజీ ఉప సర్పంచ్​ అహ్మద్​ అజీజ్​ బాలాపూర్​ తహసీల్దార్​ జనార్ధన్​రావు, జల్​ పల్లి మున్సిపాలిటీ కమిషనర్​ వసంతకు సోమవారం ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News