రూ.50 వేల యూనిట్‌కు పూర్తి రాయితీ

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన వారు మే 5 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆమనగల్లు ఎంపీడీవో కుసుమ మాధురి ఒక ప్రకటనలో తెలిపారు

Update: 2025-03-26 11:25 GMT
రూ.50 వేల యూనిట్‌కు పూర్తి రాయితీ
  • whatsapp icon

దిశ,ఆమనగల్లు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులైన వారు మే 5 వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆమనగల్లు ఎంపీడీవో కుసుమ మాధురి ఒక ప్రకటనలో తెలిపారు. రూ 50 వేల లోపు యూనిట్ కు 100% రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపారు. అదేవిధంగా రూ 50 వేల నుండి లక్ష మధ్య 90%, రూ .లక్ష నుండి రెండు లక్షల మధ్య 80%,రూ. రెండు లక్షల నుండి రూ. నాలుగు లక్షల మధ్య 70% రాయితీలు ఉంటాయన్నారు. దీనికి ఆధార్ కార్డు,రేషన్ కార్డు, ఆదయ దృవీకరణ పత్రం, కులం ధ్రువీకరణ పత్రం, పట్టాదారు పా స్ పుస్తకం, సదరం సర్టిఫికెట్, పాస్ ఫొటోస్ లతో మీ సేవ కేంద్రాల్లో వచ్చే నెల 5 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు కాపీని సంబంధిత ఎంపీడీవో కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

Similar News